Jana Nayagan |ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ నటిస్తున్న లేటెస్ట్, మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జన నాయగన్ (Jana Nayagan)’ పై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’ కి కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్‌గా ఉండబోతుందనే టాక్ ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.మొదట ఈ సినిమాను పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. అప్పటి నుంచి రిలీజ్ డేట్‌పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అభిమానులు ఎప్పుడెప్పుడు అధికారిక ప్రకటన వస్తుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో… ఇప్పుడు కీలక సమాచారం బయటకు వచ్చింది.
తాజా టాక్ ప్రకారం, ‘జన నాయగన్’ ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. నేడు రానున్న కీలక తీర్పు తర్వాత మేకర్స్ ఇదే డేట్‌ను అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో విజయ్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం పీక్స్‌కు చేరింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, మమితా బైజు విజయ్ కూతురు పాత్రలో కీలకంగా కనిపించనుంది. ఇక విలన్ పాత్రలో బాబీ డియోల్ నటించడం ఈ సినిమాకు మరో హైలైట్. ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా, కథలో కీలక మలుపులు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం.
సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ అందిస్తున్న మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే అనిరుద్ – విజయ్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ తెలిసిందే. ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌ను కే.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గ్రాండ్ స్కేల్లో నిర్మిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. మొత్తంగా చూస్తే, సోషల్ మెసేజ్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్‌ను మేళవించిన పవర్ఫుల్ ఎంటర్టైనర్గా ‘జన నాయగన్’ ప్రేక్షకుల ముందుకు రానుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఇక ఫిబ్రవరి 6 డేట్‌పై అధికారిక క్లారిటీ వస్తే… బాక్సాఫీస్ వద్ద విజయ్ మరోసారి తన సత్తా చాటడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు.