తమిళ అగ్ర నటుడు విజయ్ కథానాయకుడిగా రూపొందుతున్న పాన్ ఇండియా పొలిటికల్ థ్రిల్లర్ ‘జన నాయకుడు’. తమిళ రాజకీయాల్లో విజయ్ బిజీ అయిన నేపథ్యంలో.. ఆయన చివరి సినిమాగా ‘జన నాయకుడు’ రానున్నది. హెచ్.వినోద్ దర్శకుడు. వెంకట్ కె.నారాయణ నిర్మాత. వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఆదివారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్‌ని, ఓ స్పెషల్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. 65 సెకన్స్ నిడివి ఉన్న ఈ గ్లింప్స్‌ని గమనిస్తే.. ‘నా హృదయంలో ఉండే..’ అంటూ సాగే విజయ్ మాటలతో ఈ గ్లింప్స్ మొదలైంది.
పోలీస్ డ్రెస్‌లో లాఠీ పట్టుకుని యుద్ధ వాతావరణాన్ని తలపించే ప్రదేశంలో నడుస్తూ ఈ గ్లింప్స్‌లో కనిపించారు విజయ్. శక్తి, శాంతి, గంభీరత కలగలిపేలా ఉన్న ఈ గ్లింప్స్.. రాజకీయంగా విజయ్ లక్ష్యాలను ప్రతిబింబించేలా ఉంది. ఇక సింహాసనంపై ఠీవీగా కూర్చుని, చేతిలో కత్తితో ఇంటెన్స్ లక్‌లో విజయ్ కనిపిస్తున్న పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి స్వరాలను అందిస్తున్న విషయం తెలిసిందే.