Major Movie | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘మేజర్’ ఒకటి. అడవి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి శశి కిరణ్ టిక్కా దర్శకత్వం వహించాడు. ముంబై బాంబు దాడుల్లో అమర వీరుడైన మేజర్ సందీప్ ఉన్నీ క్రిష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇదివరకే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నమోదు చేశాయి. ఇటీవలే కొన్ని నగరాల్లో మేజర్ ప్రీమియర్ షోలు వేయగా.. వాటికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదల కానుంది.
ఈ క్రమంలో మేకర్స్ ‘జన గణ మన’ సాంగ్‌ను విడుదల చేశారు. రాజీవ్ భరద్వాజ్ సాహిత్యం అందించిన ఈ పాటను టోజన్ టోబి, శ్రీచరణ్ పాకాలా ఆలపించారు. దేశ భక్తి గురించి సాగే ఈ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. శ్రీచరణ్ స్వర పరిచిన ట్యూన్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. వంశీ సినిమాటోగ్రఫి విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైనమెంట్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఏయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అడివిశేష్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. శోభితా ధూళిపాల కీలకపాత్రలో నటించింది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.