James Cameron | అణుబాంబు దాడికి తెర రూపం ఇచ్చే సాహసం చేస్తున్న కామెరూన్.. అఫీషియల్ ప్రకటన
James Cameron | టైటానిక్ తో భావోద్వేగాలను, ‘అవతార్’ ఫ్రాంఛైజీతో విజ్ఞాన ఫిక్షన్‌ను మిళితం చేస్తూ ప్రపంచ సినిమాని షేక్ చేసిన దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్ ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు.
James Cameron | టైటానిక్ తో భావోద్వేగాలను, ‘అవతార్’ ఫ్రాంఛైజీతో విజ్ఞాన ఫిక్షన్‌ను మిళితం చేస్తూ ప్రపంచ సినిమాని షేక్ చేసిన దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్ ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ‘అవతార్ 3: ఫైర్ అండ్ యాష్’ (2025), ‘అవతార్ 4’ (2029), ‘అవతార్ 5’ (2032) లాంటి భారీ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన పని చేస్తున్న కామెరూన్, ఇప్పుడు ‘అవతార్’కి సంబంధం లేని మరో ప్రత్యేకమైన సినిమాను ప్రకటించాడు. ఈ సినిమా కథా నేపథ్యం రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిరోషిమా అణు దాడి ఆధారంగా ఉండనుంది. ఇది కామెరూన్‌కి ‘టైటానిక్’ తర్వాత అత్యంత ఇష్టమైన, శక్తివంతమైన కథ ఇదే అని ఆయన స్వయంగా తెలిపారు.
ఈ సినిమా కోసం కామెరూన్ తన దీర్ఘకాల స్నేహితుడు, రచయిత చార్లెస్ పెల్లెగ్రినో రాసిన Ghosts of Hiroshima అనే పుస్తకాన్ని ఆధారంగా తీసుకుంటున్నారు. టైటానిక్ కథపై కూడా ఇదే రచయితతో కలిసి పనిచేశాడు కామెరూన్. ఈ చిత్రం కథ ఆగస్టు 6తో ప్రారంభమవుతుంది. అదే రోజు 1945లో అమెరికా జపాన్‌పై అణుబాంబును విసిరింది. అణు దాడి 80వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈ సినిమాను ప్రకటించటం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. “ఈ కథను తెరపై చూపించాలన్న ఆలోచన ఒక సాహసమే,” అంటూ కామెరూన్ వ్యాఖ్యానించాడు. ఇది ఎమోషన్, రియాలిటీ, శాస్త్రాన్ని కలిపిన కథ. పుస్తకంలోని కథను ఉన్నది ఉన్నట్టు తీస్తే మొదటి 20నిమిషాల్లోనే జనం థియేటర్ల నుంచి బయటకు వెళ్లిపోతారు.
అందుకే ప్రేక్షకుడికి అనుభూతి అందించేలా, సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తానని కామెరూన్ స్పష్టం చేశారు. టైటానిక్ సినిమా కోసం నేను సముద్ర గర్భంలోని శిథిలాలను 33సార్లు పరిశీలించారు. హిరోషిమా దాడి నేపథ్యంలో తీసే ఈ చిత్రానికి కూడా అదే స్థాయి పరిశోధన చేస్తాను.సినిమాలే మనల్ని నిజంగా రక్షించగలవు అని సినిమా శక్తిని మరోసారి గుర్తు చేసుకున్నాడు కామెరూన్. కాగా, అణుబాంబు దాడి… చరిత్రలో ఓ విషాద అధ్యాయం. 1945లో అమెరికా, జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు వేయడం ప్రపంచ యుద్ధ చరిత్రలో అత్యంత దారుణ సంఘటనగా మిగిలిపోయింది. వేలాదిమంది మృతిచెందగా, లక్షల మందికి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అణు యుద్ధ భీకరతను చూపించాలనే ప్రయత్నమే కామెరూన్ తీసుకుంటున్న ఈ కొత్త సినిమా ఉద్దేశం. ‘అవతార్’ సినిమాలు ఇంకా మూడూ రావాల్సి ఉన్న ఈ సమయంలో, ఒక మానవీయ విపత్తు ఆధారంగా సినిమా తీసేందుకు ముందుకొస్తున్న కామెరూన్ నిర్ణయం సినిమా రంగానికే కొత్త దిశ చూపించవచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

