“ఆర్ఆర్ఆర్’తో రాజమౌళి అద్భుతం చేశారు. ఆయన్ను కలవడం ఎప్పటికీ మర్చిపోలేను. ప్రపంచ వేదికపై ఇండియన్ సినిమాను చూడటం ఆనందంగా అనిపించింది’ అని చెప్పారు హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్. 51వ వార్షిక శాటర్న్ అవార్డుల ఫంక్షన్ ఇటీవల అమెరికాలో నిర్వహించగా, జేమ్స్ కామెరూన్ హాజరయ్యారు. గత ఏడాది రాజమౌళితో గడిపిన క్షణాలను ఆయన ఈ వేదికపై గుర్తు చేసుకుంటూ రాజమౌళిని మరోమారు పొగడ్తల్లో ముంచెత్తారు. ఆ వీడియో నెట్టింట సందడి చేస్తున్నది.
గతంలో జేమ్స్ కామెరూన్ ‘ఆర్ఆర్ఆర్’ను మొదటిసారి వీక్షించి ఆశ్చర్యపోయా. గ్రాఫిక్స్‌తోపాటు అన్ని పాత్రలనూ చాలా బాగా చూపించారు. స్టోరీ చెప్పడంలో షేక్స్పియర్ను తలపించారు’ అని రాజమౌళిని ప్రశంసించారు. అప్పుడు కామెరూన్‌ను కలిసిన రాజమౌళి ‘ఆయన నాతో 10 నిమిషాలు మాట్లాడారంటే నమ్మలేకపోతున్నా. నా డైరెక్షన్లో వచ్చిన సినిమాను ఆయన విశ్లేషించి చెప్పడాన్ని జీవితంలో మర్చిపోలేను’ అంటూ ఓ పోస్ట్ చేశారు. మహేశ్‌బాబుతో చేస్తున్న సినిమా పనుల్లో రాజమౌళి ప్రస్తుతం బిజీగా ఉన్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. సంగీత చర్చలు జరుగుతున్నాయి.