Jame Cameron | హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ సినిమాపై మరోసారి ప్రశంసలు కురిపించాడు. తాజాగా జేమ్స్ ఓ ఇంట్వూలో ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ను చూసి తను ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు. ఈ సినిమాలో గ్రాఫిక్స్‌తో పాటు ప్రతి పాత్రను బాగా చూపించారని అన్నాడు. కథ చెప్పడంలో రాజమౌళి, షేక్ స్పియర్స్‌ను తలపించాడని వర్ణించాడు. ఆర్ఆర్ఆర్లో రామ్ పాత్ర మరో స్థాయిలో ఉందని, వాటన్నిటి గురించి రాజమౌళితో వివరంగా మాట్లాడాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా కిందటి సారి రాజమౌళిని కలిసినప్పుడు టైమ్ దొరకలేదని తెలిపాడు.
కాగా గతంలో అమెరికాలో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో రాజమౌళి, జేమ్స్ కామెరూన్ దంపతులను కలిశాడు. వాళ్లతో కాసేపు ముచ్చటించాడు. ‘గ్రేట్ జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ సినిమాను చూశాడు. దాన్ని ఆయనెంతో ఇష్టపడ్డాడు. అంతేకాకుండా తన భార్య సుజీకికు రికమెండ్ చేసి మరోసారి చూశారు. నాతో పది నిమిషాలు పాటు సినిమా గురించి విశ్లేషించడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. అదే విధంగా ‘మీరు ప్రపంచంలోనే టాప్ డైరెక్టర్ అంటూ’ నన్ను ప్రశంసించడం ఆనందంగా ఉంది. మీ ఇద్దరికి ధన్యవాదాలు అంటూ’ కామెరూన్ దంపతులతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ రాజమౌళి ఉప్పొంగిపోయాడు.