Hukum Song | పది రోజుల్లో విడుదల కాబోతున్న జైలర్ సినిమా ప్రమోషన్లు జోరందుకున్నాయి. మొన్నటి వరకు పెద్దగా అంచనాల్లేని ఈ సినిమాపై పాటలు, ఆడియో లాంచ్‌లో రజనీ స్పీచ్ మాములు హైప్ తీసుకురాలేదు. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 10న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే బిజినెస్ లెక్కలు కూడా పూర్తయిపోయినట్లు తెలుస్తుంది. ఇక తెలుగులోనూ వీలు చూసుకుని ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నట్లు ఇన్సైడ్ టాక్. ఇక తమిళంతో సహా తెలుగులోనూ ఈ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. దానికి తగ్గట్లే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లను ప్రకటిస్తూ ఇక్కడ కూడా మంచి బజ్‌ను తీసుకొస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలో హుకుమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అనురుధ్ స్వర పరిచిన ఈ పాట గూస్బంప్స్ తెప్పిస్తుంది. భాస్కర భట్ల లిరిక్స్ అదిరిపోయాయి. ఇక రజనీ స్వాగ్ అయితే వేరే లెవల్లో ఉంది. ఇప్పటికే కావాలయ్య సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఇక ఇప్పుడు అదే తరహాలో ఈ పాట కూడా దూసుకుపోతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ప్రస్తుతం రజనీకాంత్ ఓ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘రోబో’ తర్వాత ఇప్పటివరకు రజనీకు సరైన హిట్టే లేదు. మధ్యలో ‘పేట’ ప్రేక్షకులను ఆకట్టుకున్న, కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు రజనీ ఆశలన్నీ జైలర్పైనే ఉన్నాయి. అన్నాతే వంటి అల్ట్రా డిజాస్టర్ తర్వాత వస్తుండటం.. నెల్సన్ చివర సినిమా బీస్ట్ ఘోరంగా ఫ్లాప్ అవడం వంటి వాటితో జైలర్ బిజినెస్‌పై బాగానే దెబ్బపడిందని చెన్నై టాక్. అయితే ఇప్పటికే కొంత మంది సినీ క్రిటిక్స్‌కు షో వేయగా.. వాళ్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని టాక్. సూపర్ స్టార్‌కు ఇది పక్కా కంబ్యాక్ సినిమా అని అంటున్నారు.