Hanuman Movie | టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్‌వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘హనుమాన్’. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలావుంటే ఈ సినిమా 50 రోజుల వేడుక నేడు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇక ఈ వేడుకలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ఈ మూవీని బ్లాక్ బస్టర్ చేసినందుకు ప్రేక్షకులను ధన్యవాదాలు తెలిపాడు. అలాగే ‘హనుమాన్’ సీక్వెల్ జై హనుమాన్ పై స్పందించాడు.
జై హనుమాన్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో కూడా హనుమంతుడే హీరో. జై హనుమాన్ ఫస్ట్ లుక్‌ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాం. హనుమాన్ సినిమా క్లైమాక్స్‌లో చివరి ఐదు నిమిషాలలో వచ్చే హై ఏదైతే ఉందో అదే ఊపు జై హనుమాన్ సినిమాలో రెండు గంటలు ఉంటుందని ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#JaiHanuman First Look Poster Coming Soon pic.twitter.com/i9enazvuuS
— Aakashavaani (@TheAakashavaani) March 2, 2024
‘రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?’ అన్న స్టోరీతో హనుమాన్’ సీక్వెల్ జై హనుమాన్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హనుమంతుడిగా కనిపించబోయేది ఎవరంటూ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది.