
నందమూరి అభిమానులకు (Nandamuri fans) కావాల్సిన వినోదాన్ని అందిచేందుకు ఎప్పుడూ ముందుంటాడు బాలకృష్ణ (Balakrishna). ఈ సీనియర్ హీరో కనిపించాడంటే చాలు వెంటనే వినిపించే నినాదం జై బాలయ్య..జై జై బాలయ్య (Jai Balayya). అల్లు అర్జున్ (Allu Arjun), నాని (Nani) లాంటి స్టార్ హీరోలు సైతం ఈ స్లోగన్ వినిపించారంటే బాలయ్యకున్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం నందమూరి అభిమానులే కాదు..మూవీ లవర్స్ లో చాలా మంది జై బాలయ్య అనే పదం వినిపించగానే ఎక్జయిట్ అవుతుంటారు. బాలయ్య ఫీవర్ ఖండాంతరాలను దాటింది.
యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జిపోర్టు ( University of Bridgeport)ఇంటరాక్షన్ సెషన్లో విద్యార్థులంతా జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు ఢీ డ్యాన్స్ షోలో జై బాలయ్య అంటూ హోరెత్తించాడు. ఇలా లోకల్ టు ఇంటర్నేషనల్ రేంజ్ కు జై బాలయ్య నినాదం చేరిపోయి..ఓ ఆంథెమ్లా మారిపోయింది. హైదరాబాద్లోని పబ్స్ లో, మల్టీ ప్లెక్స్ లో జై బాలయ్య నినాదాలు హోరెత్తిపోతుండటం బాలకృష్ణకున్న క్రేజ్ ను తెలియజేస్తున్నాయి. బాలయ్యా మజాకా..అని ఈ వీడియోను షేర్ చేస్తూ తెగ ఎగిరిగంతేస్తున్నారు నందమూరి అభిమానులు.
#JaiBalayya slogans at orientation program in university of Bridgeport 🇺🇸
— Jashti Suresh 🇮🇳 (@SureshJashti) January 30, 2022
Pure Mass of #Balayya 💥🔥@MusicThaman#Akhanda #AkhandaMassJaathara #NandamuriBalakrishna #AkhandaRoarOnHotstar pic.twitter.com/vvrDGjLHXw
సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లకు జనాలు వస్తారా..? రారా డైలామాకు చెక్ పెడుతూ కలెక్షన్ల వర్షం కురిపించింది అఖండ. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబో రూపంలో హ్యాట్రిక్ హిట్టు ఇండస్ట్రీకి అందింది.