NTR30 Movie | నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ‘NTR30’. ‘ఆర్ఆర్ఆర్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ సినిమా తెరకెక్కనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించనుడటంతో ప్రేక్షకులు ఎగ్జైట్మెంట్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనులలో నిమఘ్నమై ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తారక్‌కు జోడీగా ఇద్దరు హీరోయిన్లను అనుకుంటున్నారట.
ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే జాన్వీకు కథను కూడా వినిపించారట. కథ నచ్చడంతో జాన్వీ కపూర్ వెంటనే ఓకే చెప్పిందట. కానీ ఇంకా ఈ ప్రాజెక్ట్‌పై సంతకం చేయలేదట. ప్రస్తుతం తనకున్న కమిట్మెంట్స్ దృష్ట్యా ఈ సినిమాకు డేట్స్‌ను అందుబాటు చేయలేకపోతుందట. డేట్స్ విషయంలో క్లారిటీ వచ్చాకే ఈ మూవీకి సైన్ చేయనున్నట్లు టాక్. ఒకవేళ జాన్వీ ఈ ప్రాజెక్ట్‌కు సైన్ చేయకపోతే రష్మికను తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా అండర్ వాటర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనుందట. ప్రతీ సినిమాలో ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే కొరటాల.. ఈ సినిమాలో కూడా వాటర్‌కు సంబంధించిన సోషల్ మెసేజ్‌ను ప్రేక్షకులకు ఇవ్వనున్నాడట. ఈ సినిమాకు దేవర అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు టాక్. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్స్ట్, యువసుధ ఆర్స్ట్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్‌రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.