Simbaa | టాలీవుడ్ యాక్టర్లు జగపతిబాబు (Jagapathi Babu), అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సింబా (Simbaa). ఈ చిత్రానికి పాపులర్ డైరెక్టర్ సంపత్ నంది కథను అందించగా.. మురళీ మనోహర్ దర్శకత్వం వహించాడు. ఆగస్ట్ 9న విడుదలైన సింబా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ప్రకృతిని కాపాడకోవాలనే సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
కాగా ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో సింబా మంచి స్పందన రాబట్టుకుంటోంది. సింబా ఓ వైపు అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 6 ప్లేస్‌లో ట్రెండింగ్‌లో నిలుస్తూనే.. మరోవైపు ఆహాలో 10 రోజులుగా ట్రెండింగ్ అవుతుంది. సినిమాకు మూవీ లవర్స్ ఎంతలా కనెక్ట్ అవుతున్నారో తాజా అప్డేట్ చెప్పకనే చెబుతోంది.
చెట్లను పెంచాల్సిన ఆవశ్యకత, బాధ్యతను గుర్తు చేస్తూ సాగే ఈ చిత్రంలో అనసూయ, శ్రీనాథ్ మాగంటి, వశిష్ఠ సింహా, గౌతమి, కస్తూరి కీలక పాత్రల్లో నటించారు. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందో మరి. సంపత్ నంది దగ్గర దర్శకత్వ శాఖలో పలు చిత్రాలకు పనిచేసిన మురళీమనోహర్ ఈ చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు.
🚨 #Simbaa A Sci-Fi Crime Thriller trending Top 10 on @PrimeVideoIN💥✌🏽🫶🏽
Don’t Miss It 👇🏽
▶ https://t.co/PZbnrDUOqH@IamSampathNandi @anusuyakhasba @IamJagguBhai @maganti_srinath @ImSimhaa #RajenderReddy #RajDasariProductions @MuraliMano95490 @KasthuriShankar @DiviVadthya pic.twitter.com/cjJp9A3huW— Sampath Nandi Team Works (@SampathNandi_TW) September 10, 2024
Jani Master | క్యారవాన్‌లో నన్ను బలవంతం చేశాడు.. జానీ మాస్టర్‌పై బాధితురాలు స్టేట్మెంట్
VidaaMuyarchi | డైలామాకు చెక్.. అజిత్ కుమార్ విదాముయార్చి రిలీజ్ ఎప్పుడో చెప్పిన అర్జున్
Vettaiyan | రజినీకాంత్ వెట్టైయాన్ ఆడియో లాంచ్ డేట్, ప్లేస్‌పై మేకర్స్ క్లారిటీ