Jagapathi Babu | టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మొదట్లో హీరోగా నటించిన జగపతి బాబు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అదరగొడుతున్నాడు. ముఖ్యంగా విలన్‌గా జగపతిబాబు అదరగొట్టేస్తున్నాడు.ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో వెంటనే ప్రతినాయకుడిగా మారిన జగపతి బాబు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. జగపతి బాబు ఏది మాట్లాడిన ముక్కుసూటిగా మాట్లాడేస్తాడు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన పెద్ద కూతురికి పెళ్లిచేసి తప్పుచేశానని ,రెండో అమ్మాయికి పెళ్లి చేయనని సంచలన కామెంట్ చేశారు.
జగపతిబాబుకి ఇద్దరు అమ్మాయిలు కాగా, పెద్ద కూతురుని అమెరికాకి చెందిన వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేశాడు. అమెరికా వ్యక్తిని అతని కూతురు ఇష్టపడితే వెంటనే అతనికి ఇచ్చి వివాహం చేశాడు. ఇక పెద్ద కుమార్తె నాకు పిల్లలు వద్దు ఎవరినైన దత్తత తీసుకుని పెంచుకుంటాను అంటే దానికి కూడా ఓకే చెప్పారట జగపతి బాబు. పిల్లలకి పెళ్లి చేశాక వారిపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు, బాధ్యతలు ఉండవని అంటున్నారు. ఇక పెద్ద కుమార్తెకి పెళ్లి చేసి తప్పు చేశాను, ఇప్పుడు చిన్న కుమార్తెకి తాను పెళ్లి చేయను అంటున్నారు. నువ్వు ఎవరినైనా ఇష్టపడినా, ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పు.. అతన్ని పెళ్లి చేసుకుంటానంటే అప్పడు పెళ్లి చేస్తా… నాకు నేనుగా పెళ్లి మాత్రం చేయనని ఖరాఖండీగా చెప్పేశారట జగపతి బాబు.
పిల్లలు వారికి నచ్చినట్లు మనం బతకనిస్తే అది ప్రేమ అవుతుందని. బాధ్యత అంటే మన స్వార్థం కోసం పిల్లలను బలిచేయడమే అని అంటున్నారు . తన దృష్టిలో బాధ్యతకన్నా ప్రేమనే గొప్పదని నమ్ముతాను. బాధ్యత అనేది పూర్తిగా రాంగ్ వర్డ్. తన దృష్టిలో బాధ్యత అంటే పిల్లల్ని పెళ్లి చేసుకోమని చెప్పడం.. ప్రేమ అంటే నీకు ఏది ఇష్టమైతే అది చేయమని పిల్లలకు చెప్పడమని జగపతిబాబు చెప్పుకొచ్చారు. ఇక పిల్లల విషయంలో జగపతి బాబు తీసుకునే నిర్ణయాల విషయంలో ఆయన భార్య కూడా తనతో ఏకీభవిస్తుందని అన్నారు.