అప్పలసూరి గుర్తుండిపోతాడు!
ఇప్పటివరకు తాను చేసిన చిత్రాల్లో ‘పెద్ది’ చాలా ప్రత్యేకమని, ఇందులో అప్పలసూరిగా బలమైన భావోద్వేగాలు కలబోసిన పాత్రలో కనిపిస్తానని, ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర ఇదని చెప్పారు సీనియర్ నటుడు జగపతిబాబు. రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం జగపతిబాబు విలేకరులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
ఇప్పటివరకు తాను చేసిన చిత్రాల్లో ‘పెద్ది’ చాలా ప్రత్యేకమని, ఇందులో అప్పలసూరిగా బలమైన భావోద్వేగాలు కలబోసిన పాత్రలో కనిపిస్తానని, ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర ఇదని చెప్పారు సీనియర్ నటుడు జగపతిబాబు. రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం జగపతిబాబు విలేకరులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
- సెట్స్‌లో తొలిసారి అప్పలసూరి గెటప్ వేసుకున్నప్పుడే ఈ పాత్ర అద్భుతంగా ఉంటుందని అర్థమైంది. జాతీయ అవార్డు గ్రహీత రషీద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నా లుక్‌ని డిజైన్ చేశారు. ఈ సినిమాలో జగపతిబాబు కాదు..తెరపై కేవలం అప్పలసూరి పాత్ర మాత్రమే కనిపిస్తుంది.
- ఎమోషన్స్, గెటప్ పరంగా నాకు చాలా నచ్చిన పాత్ర ఇది. రామ్‌చరణ్ సినిమాలో ఈ క్యారెక్టర్ చేయడం మరింత ఆనందాన్నిచ్చింది. అతన్ని నాతో పాటు మా ఫ్యామిలీలో అందరూ ఇష్టపడతారు. చరణ్ పలకరింపులోనే ఓ ఆప్యాయత ఉంటుంది. వ్యక్తిగా చాలా మంచివాడు. ‘రంగస్థలం’ నుంచి రామ్‌చరణ్ నటుడిగా ఎంతో పరిణతి సాధిస్తున్నారు. ప్రతీ సినిమాలో మరింత అందంగా కనిపిస్తున్నారు.
- ‘లెజెండ్’ తర్వాత చాలా సినిమాలు చేశా. వాటిలో గుర్తుపెట్టుకునేవి ఓ ఆరుంటాయి. ఆ జాబితాలో అప్పలసూరి పాత్ర మొదటిస్థానంలో ఉంటుంది. ఇందులో నేను పోషించింది తండ్రి పాత్ర కాదు. ప్రేమ, అనుబంధం కలబోసిన పాత్రలో కనిపిస్తా. రామ్‌చరణ్ పాత్రతో ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది.
- ఈ సినిమా డబ్బింగ్ విషయంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకున్నా. అప్పలసూరి పాత్ర వాయిస్‌తోనే ఎలివేట్ అవుతుంది. అతను మాట్లాడుతున్నప్పుడు ఇంకెవ్వరూ కనిపించకూడదు అనేది నా ప్రయత్నం. అందుకే ఓ రోజంతా కూర్చొని కేవలం రెండు డైలాగులు మాత్రమే చెప్పిన సందర్భాలున్నాయి.
- ‘పెద్ది’ ఈరోజు ఇండస్ట్రీకి పెద్దదిక్కులాంటి సినిమా. పరిశ్రమ గట్టిగా ఊపిరిపీల్చుకునే సందర్భం వచ్చింది. ఓ నటుడిగా నేను కూడా రిలాక్స్‌గా ఫీలయ్యాను. ఈ సినిమాకు పనిచేసిన ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను. అప్పలసూరి పాత్రలోని ఎమోషనల్ డెప్త్ నేను చేసిన ఏ పాత్రలోనూ లేదు. నేను ఇంత కాన్ఫిడెంట్‌గా ఎందుకు చెబుతున్నానో సినిమా చూశాకే మీకు అర్థమవుతుంది. ప్రస్తుతం ‘బ్లాక్ అండ్ వైట్’ అనే ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

