ఒకపుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..చాలా కాలం ఫాంలో ఉన్నాడు..మధ్యలో సోలో హీరోగా అంతగా కలిసి రాకపోవడంతో గ్యాప్ తీసుకున్నాడు. బాలకృష్ణ నటించిన లెజెండ్‌తో విలన్‌గా గ్రాండ్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఆయనెవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ జగ్గూభాయ్ (Jagapathi Babu)ను తిరుగులేని యాక్టర్‌గా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. లెజెండ్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ బడా ప్రాజెక్టుల్లో నటిస్తూ తన క్రేజ్‌ను రోజు రోజుకీ పెంచుకుంటూ ముందుకెళ్లిపోతున్నాడు.
ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉండే జగ్గూభాయ్ ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలుసా..? అరబ్ కంట్రీ దుబాయ్ టూర్లో ఉన్నాడు జగపతిబాబు. దుబాయ్ వాటర్ పార్క్ (Dubai water park) లో ఉన్నానంటూ తన ఫాలోవర్లకు ఓ ఫొటో ద్వారా క్లారిటీ ఇచ్చేశాడు. దుబాయ్ వాటర్ పార్కులో అలసిపోయిన ఫ్యామిలీ (Jaggu bhai family)కి దాహం తీర్చడానికి..అంటూ సాల్ట్ పెప్పర్ లుక్‌లో బాడీని టవాలుతో కప్పేసుకుని, చేతిలో కొబ్బరి బొండంతోపాటు కూల్ డ్రింక్స్ పట్టుకుని హ్యాపీగా నడుచుకుంటూ వస్తున్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Dubai water park lo aliasipoyana family ki daaham theerchadaniki. pic.twitter.com/CRWI4QWQ3l
— Jaggu Bhai (@IamJagguBhai) March 6, 2022
జగపతిబాబు ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తోన్న గని చిత్రంతోపాటు పాన్ ఇండియాసినిమాలు రాధేశ్యామ్, సలార్‌లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.