Dhanush | తమిళంలో విలక్షణ కథానాయకుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు ధనుష్. మరోవైపు దర్శకుడిగా కూడా ఆయన చక్కటి ప్రతిభ కనబరుస్తుంటారు. ఆయన డైరెక్షన్లో వచ్చిన పాండి, రాయన్ చిత్రాలు భారీ విజయాల్ని సాధించాయి. తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రాన్ని ‘జాబిలమ్మ నీకు అంత కోపమా..’ పేరుతో తెలుగులో విడుదల చేయబోతున్నారు.
రొమాంటిక్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలకానుంది. పవీష్, అనిఖ సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్నందిస్తున్నారు.