Jaat | టాలీవుడ్ దర్శకుడు గోపిచంద్ మలినేని బాలీవుడ్ హీరో సన్నీ డియోల్‌తో జాట్ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణతో వీరసింహారెడ్డి అనే చిత్రాన్ని తెరకెక్కించి మంచి హిట్ కొట్టిన గోపిచంద్ మలినేని ఇప్పుడు జాట్తో కూడా హిట్ కొట్టేలా ఉన్నాడు. ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఇది అందరిని ఆకట్టుకుంది. పవర్ఫుల్ డైలాగ్‌లు, యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.ఏప్రిల్ 10న ఈసినిమా విడుదల కానుండగా, మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి.
చిత్రంలో సన్నీ డియోల్ సరసన సయామీ ఖేర్, రెజీనా కాసాండ్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా మూవీ నుండి ఓ రామ శ్రీరామ అనే సాంగ్ విడుదల చేశారు. థమన్ స్వరాలు అందించగా, ధనుంజయ్ ఈ పాటని ఆలపించారు. సాంగ్ ఎంతో ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ని మీరు ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయండి.
‘జాట్’ను తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేడి డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తారని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసింది కాని ఇప్పటికైతే హిందీలో మాత్రమే రిలీజ్ కానుందట. ఈ చిత్రాన్ని వీక్షించిన సన్నీ డియోల్ కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేయాలని సూచించారట. తెలుగు డబ్బింగ్ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. రిలీజ్‌కు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం కుదరకపోవచ్చని తెలుస్తోంది.