Jaanvi Kapoor | అలనాటి తార దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్లో చేసినవి కొన్ని సినిమాలైనా.. తనదైన గ్లామర్ మరియు యాక్టింగ్‌తో యూత్‌కు ఆరాధ్య హీరోయిన్ అయింది. అయితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయినా ఈ భామకు సరైన బ్రేక్ రాలేదు. కానీ మంచి నటిగా మాత్రం నిరూపించుకుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర చిత్రంలో కథనాయికగా నటిస్తుంది. అయితే ఎప్పుడు వెస్టర్న్ డ్రెస్‌లలో కనిపించే జాన్వీ తాజాగా సాంప్రదాయ లుక్‌లో కనిపించింది.
దీపావళి పండగ సందర్భంగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) ఇచ్చిన పార్టీలో జాన్వీ కపూర్ (Jaanvi Kapoor) ఈమె సోదరి ఖుషి కపూర్ (Kushi Kapoor) లంగా ఓణీలో మెరిసిపోతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. జాన్వీ.. ఊదా రంగు (Violet) కలర్లో, ఖుషి లైట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఓట్ఫిట్లో మెరిశారు. కాగా.. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు దేవర సినిమా నుంచి రీసెంట్గా లంగా ఓణీలో విడుదలైన జాన్వీ కపూర్ లుక్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.
Janhvi Kapoor with her sister Kushi Kapoor at Karan Johar’s Diwali Bash !!!#JanhviKapoor #KushiKapoor pic.twitter.com/ExHmL7fWa8
— Filmzeal (@filmzeal) November 10, 2023