Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan)టైటిల్ రోల్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కొన్ని షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఉస్తాద్భగత్ సింగ్ గురించి కొత్త న్యూస్ అందించాడు హరీష్ శంకర్ (Harish Shankar S).
ఈ మూవీ భారీ యాక్షన్ షెడ్యూల్ చిత్రీకరణకు అంతా సిద్దమైంది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ రేపటి నుంచి షురూ కానుంది..అంటూ ట్వీట్ చేశాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఇందులో ఉస్తాద్ భగత్ సింగ్ చాలా పదునైన ఆయుధాలను వినియోగించబోతున్నట్టు తెలియజేశాడు. ఇప్పుడీ లుక్ నెట్టింటిని షేక్ చేస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ అవుతూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.
భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ తనదైన మ్యానరిజంతో సాగుతున్న పవన్ కల్యాణ్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
All set for the MASSIVE ACTION SCHEDULE 💥💥
The shoot of #UstaadBhagatSingh resumes tomorrow 🔥🔥
@PawanKalyan @harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #AnandSai @ChotaKPrasad @SonyMusicSouth pic.twitter.com/gCjSVeN0t4— Mythri Movie Makers (@MythriOfficial) September 4, 2023
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్..