Vidaa Muyarchi | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి VidaaMuyarchi. ఏకే 62గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. త్రిష (Trisha) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. తాజా షెడ్యూల్లో భాగంగా అజిత్ కుమార్ అజర్‌బైజాన్‌కు బయలుదేరాడు.
ఎయిర్‌పోర్టులో నుంచి వెళ్తున్న విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సుమారు 5 నెలల విరామం తర్వాత షురూ అయిన ఈ షెడ్యూల్‌తో మూవీ షూటింగ్ పూర్తి కానున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఎక్కువభాగం అజర్బైజాన్లో షూట్ చేస్తుండగా.. ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను ఇక్కడే పూర్తి చేశారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjaydutt), యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అజిత్ కుమార్ మరోవైపు అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ ఏకే 63 కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్‌తో వస్తున్న ఈ మూవీకి సంబంధించి కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
AK Leaving To Azerbaijan To Kick Start The Final Schedule of #VidaaMuyarchi💥💥
THALA DIWALI 💯 #AjithKumar || #GoodBadUgly pic.twitter.com/Sp4wMcGbB4
— AJITH FANS COMMUNITY (@TFC_mass) June 19, 2024