Mythri Movie Makers | మైత్రీ నిర్మాణ సంస్థపై ఐటీ దాడులు..!
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో మూత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒకటి. తాజాగా ఈ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు దాడులు చేశారు. సోమవారం ఉదయం నుండి సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఐటి అధికారులు ఏకకాలంలో 15చోట్ల రైడ్స్ చేపట్టారు.
Mythri Movie Makers | టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో మూత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒకటి. తాజాగా ఈ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు దాడులు చేశారు. సోమవారం ఉదయం నుండి సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఐటి అధికారులు ఏకకాలంలో 15చోట్ల రైడ్స్ చేపట్టారు. కాగా.. మైత్రీ సంస్థ యజమానులు యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని ఇళ్లలోనూ ఐటి అధికారులు సోదాలు చెపట్టారు.
మైత్రీ బ్యానర్లో వస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణాలకు సంబంధించిన పన్ను చెల్లింపుల పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ‘శ్రీమంతుడు’ సినిమాతో నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన మైత్రీ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’ వంటి హ్యట్రిక్ హిట్లతో టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థలో ఒకటిగా చోటు సంపాదించుకుంది. గతేడాది ‘పుష్ప’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యానర్లో నాలుగు సినిమాలు రూపొందుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Kishore Movie Makers | కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం ప్రారంభం.. ముఖ్య అతిథులుగా వీవీ వినాయక్, ఆది సాయికుమార్
Dharman | అఫిషీయల్.. రజనీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

