Regina Cassandra | ‘ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడానికి ఏ ఎలిమెంట్స్ కావాలో తెలిసిన దర్శకుడు అర్జున్‌సాయి. నాటకరంగంపై రీసెర్చ్ చేసి ఆయన ఈ కథ రాసుకున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న రూటెడ్ స్టోరీ ఇది. రంగస్థలం గురించి చాలా అద్భుతమైన సన్నివేశాలు ఇందులో ఉన్నాయి’ అని రెజీనా కసాండ్రా అన్నారు. దిలీప్ ప్రకాశ్‌కు జోడీగా ఆమె నటించిన చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సురేశ్ పాటిల్ నిర్మాత. ఈ నెల 13న విడుదల కానుంది. మంగళవారం రెజీనా విలేకరులతో ముచ్చటించారు.
‘ఇందులో నేను కార్పొరేట్ ఎంప్లాయ్‌గా కనిపిస్తా. తనకి ప్రేమ మీద సదాభిప్రాయం ఉండదు. చాలా ఇండిపెండెంట్. కథలో కీలకమైన పాత్ర. ఈ పాత్ర చేయడం చాలా రీఫ్రెషింగ్‌గా అనిపించింది. నాజర్, ప్రకాశ్‌రాజ్ రంగస్థలం నుంచి వచ్చారు. వారితో వర్క్ చేయడం వల్ల చాలా నేర్చుకున్నా. వర్సటైల్ యాక్టర్‌గా ఉండాలనేది నా కోరిక. చేయగలిగిన అన్ని రకాల పాత్రలూ చేయడమే నా లక్ష్యం. ప్రస్తుతం సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సినిమా చేస్తున్నా. హిందీలో ఇంకో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి’ అని చెప్పింది రెజీనా.