Raj Kundra | మీరేమనుకున్న పర్లేదు.. స్వామీజీకి కిడ్నీ దానం ట్రోల్స్‌పై స్పందించిన శిల్పాశెట్టి భర్త
Shilpa Shetty | ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఇటీవల మథురలోని ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.
Raj Kundra | ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా(Raj Kundra Kidney) ఇటీవల మథురలోని ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. అయితే స్వామిజీని కలిసిన అనంతరం ప్రేమానంద్ మహారాజ్ తాను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు రాజ్ కుంద్రా దంపతులకు తెలిపారు. దీంతో రాజ్ కుంద్రా స్పందిస్తూ.. మీరు ఒప్పుకుంటే నా కిడ్నీ దానంగా ఇస్తానని తెలిపాడు. అయితే రాజ్ కుంద్రా చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలావుంటే పోర్న్ వీడియోలు నిర్మిస్తున్నాడనే ఆరోపణలపై రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.. ఈ ఆరోపణలు నుంచి తప్పించుకోవడానికే స్వామీజీకి కిడ్నీ దానం చేస్తాడని మాట్లాడారంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. అయితే ఈ ట్రోల్స్‌పై స్పందించాడు రాజ్ కుంద్రా.
ప్రస్తుతం మనం ఎంత విచిత్రమైన ప్రపంచంలో జీవిస్తున్నామంటే.. మరొకరి ప్రాణాన్ని కాపాడటానికి కోసం ఒకరు తమలో ఒక భాగాన్ని దానం చేస్తారని చెబితే దాన్ని పబ్లిసిటీ స్టంట్ అంటూ వెక్కిరిస్తున్నారు. ఒకవేళ మీ దృష్టిలో మంచితనం అనేది పీఆర్ స్టంట్ అయితే ఈ ప్రపంచం దాన్ని ఇంకా ఎక్కువగా చూడాలి. మానవత్వం ఒక వ్యూహం అయితే, దాన్ని ఇంకా ఎక్కువ మంది స్వీకరించాలి. మీడియా లేదా మీరు చేసే ట్రోల్స్ వలన నేనేం బాధపడను. అవి నా వ్యక్తిత్వాన్ని నిర్ణయించలేవు. మీమల్ని ఆకర్షించడానికి నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఎదుటివారి గురించి తక్కువగా మాట్లాడండి ఎక్కువ ప్రేమను పంచండి. మీరు కూడా ఒకరి ప్రాణాన్ని కాపాడవచ్చంటూ రాజ్ కుంద్రా రాసుకోచ్చాడు.
Strange world we live in when someone chooses to offer a part of themselves to save another’s life, it’s mocked as a PR stunt. If compassion is a stunt, may the world see more of it. If humanity is a strategy, may more people adopt it. I’m not defined by labels the media or…
— Raj Kundra (@onlyrajkundra) August 15, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

