ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేవారేకాదు.. స్టార్‌స్టేటస్ తెచ్చుకున్న చాలామంది హీరోయిన్లు ఎప్పుడో ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నవారే! ఆ బాధితుల జాబితాలో తాను కూడా ఉన్నానని చెబుతున్నది ముంబై భామ ఇషా కొప్పికర్. నాగార్జున సరసన చంద్రలేఖ సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఇషా.. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగారు.
తాజాగా.. శివ కార్తికేయన్ హీరోగా చేసిన ‘అయలాన్’ సినిమాలో కనిపించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ‘క్యాస్టింగ్ కౌచ్’పై సంచలన కామెంట్లు చేశారు. ‘ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఒక స్టార్ నటుడు నన్ను ఒంటరిగా కలవమని అడిగారు. డ్రైవర్ కూడా లేకుండా రావాలని చెప్పారు. అప్పటికే తనపై చాలా రూమర్స్ ఉన్నాయని, ఎవరికైనా తెలిస్తే ఇబ్బంది అవుతుందని కూడా అన్నారు.
ఆ సమయంలో ఆయన బాలీవుడ్లో స్టార్ హీరో. అయినా.. ఆయన్ను కలవడానికి ఆసక్తిగా లేనని చెప్పేశాను. అంతేకాదు, సినిమాల్లో అవకాశాలు రావాలంటే హీరోలతో స్నేహంగా ఉండాలని కొంతమంది సలహాలు కూడా ఇచ్చేవారు. షూటింగ్ సమయంలోనూ కొందరు నటులు అసభ్యకరంగా తాకేవారు’ అని చెప్పుకొచ్చారు ఇషా. కాగా, ఈ సీనియర్ హీరోయిన్ తెలుగులో ప్రేమతో రా, కేశవ సినిమాలలో కూడా నటించారు.