యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ఇసాకపట్నం’. ప్రతీకారం, అధికారం, కుటుంబ రాజకీయాలు, గ్యాంగ్ వార్ తదితర అంశాల మేళవింపుగా సాగే ఈ వెబ్‌సిరీస్‌లో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రధారులు. గ్యారీ బీహెచ్ దర్శకుడు. రాహుల్ తమడా, సైదీప్ రెడ్డిబొర్రా నిర్మాతలు. జూలై 2 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నది. భావోద్వేగాల సమ్మేళనంగా సాగే థ్రిల్లర్ సిరీస్ ఇదని, ఒక కల్పిత పోర్ట్ టౌన్ చుట్టూ సిరీస్ నడుస్తుందని నిర్మాతలు తెలిపారు.
ఐశ్వర్యరాజేష్, సముద్రఖనిల అద్భుతమైన నటన, బీహెచ్ గ్యారీ దర్శకత్వ ప్రతిభ ఈ కథకు మరింత బలాన్ని చేకూర్చాయని ప్రైమ్ వీడియో ప్రతినిధి నిఖిల్మాధోక్ అన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌లో సునీల్, నరేశ్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్ కనకాల, మైమ్ రవి, రోహిణి, బెనర్జీ తదితరులు ఇతర పాత్రధారులు.