Ak62 Movie | అదే౦టో ఒక్కోసారి అన్నీ ఒకే అయి సెట్స్ మీదకు వెళ్లిన సినిమాకు కూడా అనుకోని ఇబ్బందులు తెలెత్తుతాయి. రేపో మాపో షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అనగా ఆ ప్రాజెక్ట్ నుండి ఎవరో ఒకరు తప్పుకున్నట్లు ప్రకటన వస్తుంది. అయితే ఆ తప్పుకున్నవారు టెక్నీషియన్, నటీనటులో అయితే పర్వాలేదు. కానీ కేప్టెనే తప్పుకుంటే అదో పెద్ద సమస్య. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమాకు ఇదే జరగబోతుందని సమాచారం. ఇంతకీ అది ఏ సినిమా? తప్పుకున్న దర్శకుడు ఎవరు? అని ఆలోచిస్తున్నారా?.
ఆ సినిమా అజిత్-విఘ్నేష్ శివన్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఏకే62’. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపో మాపో సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్ధమవుతుంది. ఈ లోపు ఈ ప్రాజెక్ట్ నుండి దర్శకుడు విఘ్నేష్ శివన్ తప్పుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అజిత్‌కు విఘ్నేష్‌కు మధ్య క్రియేటీవ్ డిఫరెన్సెస్ రావడంతో విఘ్నేష్ తప్పుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా విఘ్నేష్ తన ట్విట్టర్ బయోలో నుండి ఏకే62ను తొలిగించాడు. దాంతో ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇందులో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.