Sharwanand Next Movie | శర్వానంద్ సినీ కెరీర్ ఒక అడుగు ముందుకు వేస్తుంటే, నాలుగు అడుగులు వెనక్కి పడుతుంది. ఒక హిట్టు పడిందని సంతోషించేలోపే నాలుగైదు ఫ్లాపులు వెనకాల వచ్చి చేరుతున్నాయి. కావాల్సినంత నటన, కష్టపడే తత్వం రెండూ ఉన్నా శర్వానంద్‌కు లక్ మాత్రం కలిసి రావట్లేదు. కొత్త కొత్త కథలు ట్రై చేస్తున్నా ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత ‘ఒకే ఒక జీవితం’తో శర్వాకు కాస్త ఉపశమనం దొరికింది. కమర్షియల్‌గా పెద్ద బ్లాక్‌బస్టర్ విజయం సాధించకపోయినా.. శర్వాకున్న బ్యాడ్‌లక్ మచ్చను తొలిగించింది. ఇక ఇటీవలే ఎంగేజ్‌మెంట్‌ను కూడా చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టడానికి ముస్తాబవుతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే శర్వా నెక్స్ట్ సినిమా ఎంటా? అనేది ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఒకే ఒక జీవితం తర్వాత ‘ఛల్ మోహన్‌రంగా’ ఫేమ్ కృష్ణ చైతన్యతో ఓ యాక్షన్ సినిమాకు సైన్ చేశాడు. కారణాలేంటో తెలియదు కానీ, ఈ ప్రాజెక్ట్ కాన్సిల్ అయినట్లు తెలుస్తుంది. ఇదే కథతో కృష్ణ చైతన్య, విశ్వక్ సేన్ దగ్గరికి వెళ్లాడని.. విశ్వక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చిన శర్వా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కే.వి గుహన్ దర్శకత్వంలో శర్వా తన తదుపరి సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ‘హ్యపిడేస్’ తమిళ రీమేక్‌తో దర్శకుడిగా మారిన గుహన్.. తెలుగులో కళ్యాణ్ రామ్‌తో ‘118’ తెరకెక్కించి సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత ‘WWW’ అనే సినిమాను యంగ్ టాలెంట్‌తో తెరకెక్కించి ఓటీటీలో రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు ఓటీటీ ప్రియుల నుండి మంచి స్పందనే వచ్చింది. దీని తర్వాత ఆనంద్ దేవరకొండతో ‘హైవే’ తెరకెక్కించి మిశ్రమ ఫలితాన్ని అందుకున్నాడు. అసలు ఈ సినిమా వచ్చిందన్న విషయమే చాలా మందికి తెలియదు.
కాగా కే.వి గుహన్ ఇటీవలే శర్వాకు ఓ థ్రిల్లర్ కథను నెరేట్ చేశాడట. కథ బాగా నచ్చడంతో శర్వా కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు దిల్‌రాజు తీసుకున్నాడట. ప్రస్తుతం చిత్రబృందం ప్రీ ప్రొడక్షన్ పనులలో నిమగ్నమైంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రటకన రానుంది. ఇక దీనితో పాటుగా శర్వా.. శ్రీరామ్ ఆదిత్యతో ఓ సినిమాకు కమిట్ అయినట్లు టాక్. అయితే కే.వి గుహన్‌తో సినిమా పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. ఇక ఒకే ఒక జీవితం ఇచ్చిన ఉత్సాహంతో శర్వా వరుసగా సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు.