Meena Husband | మీనా భర్త మృతికి పావురాలే కారణమా?
పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న మీనా భర్త విద్యాసాగర్ ( Vidyasagar ) మృతికి పావురాల వ్యర్థాలు కూడా కారణమేనా? ఇదే విషయం ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది. లోకల్ మీడియాలో కూడా ఇవే వార్తలు వస్తున్నాయి. గతంలో మీనా కుటుంబం మొత్తానికి కరోనా సోకింది. అందరూ ఆ మహమ్మారి నుంచి బయటపడ్డారు. అయితే కరోనా సోకడానికి ముందు నుంచే విద్యాసాగర్ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. కోవిడ్ వచ్చినప్పటినుంచి ఆ సమస్య తీవ్రమైంది. దీనికి సంబంధించి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకుంటున్నారు. వైద్యులు ఆయనకు ఊపిరితిత్తుల మార్పిడి చేయాలని సూచించారు. కానీ దాతలు దొరక్కపోవడంతో అది సాధ్యం కాలేదు. ఈలోగా హఠాన్మరణం చెందారు.
అయితే విద్యాసాగర్ మృతికి పోస్ట్ కోవిడ్ సమస్యలు ఒక్కటే కారణం కాదని, పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే శ్వాస కోశ సమస్య మరింత పెరిగి ప్రాణాంతకంగా మారిందని అంటున్నారు. మీనా నివాసానికి దగ్గరలో పావురాలు ఎక్కువగా ఉంటాయి. వాటికి విద్యాసాగర్ తరచుగా దానా వేస్తూ అక్కడే గడిపేవాడట. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయనకు.. ఈ వ్యర్థాల నుంచి వచ్చిన గాలి మరింత ఇబ్బంది పెట్టిందని, సమస్య జఠిలమైందని అంటున్నారు. ఇది కూడా మీనా భర్త ( meena husband ) మృతికి ఓ కారణమే అంటూ లోకల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

