Yash Next Movie | ఐదేళ్ల కిందటి వరకు యష్ అంటే కన్నడిగులకు తప్పితే మరెవరికీ తెలియదు. ఒక్క కేజీఎఫ్ సిరీస్‌తో జాతీయ స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అయితే కేజీఎఫ్ సీక్వెల్ వచ్చి ఏడాది దగ్గరికొస్తుంది. అయినా ఇంకా యష్ తన తదుపరి సినిమాను ప్రకటించలేదు. ఎప్పుడెప్పుడు యష్ నెక్స్ట్ సినిమాను ప్రకటిస్తాడా అని ఆయన అభిమానులే కాదు, ప్రేక్షకులు సైతం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా యష్ తదుపరి సినిమాకు సంబంధించిన ఓ వార్త కన్నడ మీడియాల్లో చక్కర్లు కొడుతుంది. యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఏప్రిల్ 14న అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఓ గ్రాండ్ ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
కాగా గతేడాది అదే రోజున కేజీఎఫ్-2 విడుదలై సంచలనం సృష్టించింది. భాషతో సంబంధంలేకుండా ప్రతీ ఏరియాలో కోట్లు కొల్లగొట్టింది. ఇక బాలీవుడ్లో అయితే హిందీ హీరోల సినిమాలను పక్కకు నెట్టేసి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ‘పఠాన్’ వరకు ‘కేజీఎఫ్-2’ బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రెండో ప్లేస్‌లో ఉంది. తొలి స్థానంలో ‘బాహుబలి-2’ ఉంది. ప్రశాంత్ నీల్ టేకింగ్, యష్ యాక్షన్ సినీ ప్రియులను మళ్లీ మళ్లీ ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేశాయి. బాహుబలి తర్వాత దక్షిణాది నుంచి వెయ్యి కోట్ల మార్కు అందుకున్న రెండో సినిమాగా కేజీఎఫ్-2 నిలిచింది.