టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న క్రేజీ చిత్రం గాడ్ ఫాదర్ (Godfather). మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్‌గా తెరకెక్కుతోంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార (Nayanthara) కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నయనతారను విష్ చేస్తూ ఓ లుక్ కూడా విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఒరిజినల్ వెర్షన్లో మంజువారియర్ పోషించిన పాత్రలో నయనతార కనిపించనుంది. అయితే మంజువారియర్ (Manju Warrier) భర్తగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించాడు.
వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi)పాత్రలో సత్యదేవ్ (Satyadev)ను తీసుకోవాలని చిరు అండ్ టీం ఫిక్సయినట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అయితే తన భర్త పాత్ర కోసం ఆ యాక్టర్‌ను ఎంపిక చేయడం పట్ల నయనతార సుముఖంగా లేదన్న పుకార్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వివేక్ ఒబెరాయ్ పాత్రలో సుదీప్ కానీ, వేరే తమిళ నటుడిని కానీ తీసుకుంటారేమోనని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే సత్యదేవ్ విషయంలో నయనతార కానీ, చిత్రయూనిట్ కానీ వద్దనుకున్నదేమీ లేదట.
ప్రస్తుతం నయన్, సత్యదేవ్ వారి వారి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వారి ప్రాజెక్టు పూర్తయిన వెంటనే నయనతార, సత్యదేవ్ మధ్య వచ్చేసన్నివేశాలను చిత్రీకరించేందుకు మోహన్ రాజా టీం ప్లాన్ చేస్తుందని ఫిలింనగర్ సర్కిల్ టాక్. అయితే అప్పటివరకు చిరంజీవి భోళా శంకర్ షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నాడట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Thaman AKhanda Update | అఖండపై థమన్ ఇచ్చిన క్రేజీ అప్ డేట్ ఎంటో తెలుసా..?
Pooja Kannan Debut Film | సాయిపల్లవి సోదరి సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది
Akhanda Musical Roar | అఖండ ‘గర్జన’ కేక..టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో
TJ Gnanavel Apology | క్షమాపణలు చెప్పిన జైభీమ్ డైరెక్టర్..!