SR కళ్యాణమండపం ప్రమోషన్ వర్కవుట్ అయ్యేనా.. కష్టానికి ఫలితం దక్కేనా..?
SR కళ్యాణమండపం | SR కళ్యాణమండపం సినిమా గురించి ఇప్పుడు ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. కిరణ్ అబ్బవరం తన సినిమాకు తానే కథ, మాటలు, స్క్రీన్ ప్లే కూడా రాసుకున్నాడు.

SR Kalyanamandapam | కరోనా పుణ్యమా అని ఈ రోజుల్లో పెద్ద సినిమాలనే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సినిమాలను విడుదల చేసినా నష్టాలు తప్పవన్న భయంతో సినిమాలు విడుదల చేసేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఇలాంటి సమయంలో డేర్ చేసి తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈయన హీరోగా నటించిన SR కళ్యాణమండపం సినిమా గురించి ఇప్పుడు ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. పైగా తన సినిమాకు తానే కథ, మాటలు, స్క్రీన్ ప్లే కూడా రాసుకున్నాడు. ఈ సినిమా శుక్రవారం ( ఆగస్టు 6 న) విడుదల కానుంది. దీంతో ఎక్కడి నుంచి వచ్చాడు ఈ కుర్రాడు.. ఇతనికేంటి ఇంత ధైర్యం అంటూ చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని తెలిసినా కూడా వెనక్కి తగ్గడం లేదు. దగ్గరుండి ప్రమోషన్ చేసుకుంటున్నాడు. తాను హీరో అనే సంగతి కూడా మరిచిపోయి.. మెట్రో ట్రైన్లతో పాటు ఆటోలలో కూడా పాంప్లెంట్స్ పంచుతున్నాడు. తన సినిమాను చూడాలంటూ అందర్నీ బతిమాలుతున్నాడు. మంచి సినిమా తీశామని.. థియేటర్స్ కు వచ్చి చూసి ఆశీర్వదించాలంటూ ఆయన కోరుతున్నాడు.ఈ కుర్ర హీరో చేస్తున్న ప్రమోషన్ చూసి అంతా ఫిదా అవుతున్నారు. ఇంత కష్టపడుతున్నాడు కదా రేపు ఏదైనా ఫలితం ఉంటుందా అనే ఆసక్తి కూడా అందరిలోనూ కనిపిస్తుంది.
శ్రీధర్ గాదె తెరకెక్కించిన ఈ చిత్రంలో అనంతపూర్ అమ్మాయి ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. దివంతగ నటుడు టీఎన్ఆర్ ఇందులో చిన్న పాత్రలో మెరిశాడు. కేవలం రెండో సినిమా హీరోనే అయినా కూడా SR కళ్యాణమండపం సినిమాకు దాదాపు 5.7 కోట్లకు పైగా బిజినెస్ అయింది. అంత బిజినెస్ జరగడం కూడా ఆశ్చర్యమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ అది వెనక్కి వస్తుందా లేదా అనేది అనుమానమే. ఇప్పటికే రెండు కరోనా సీజన్స్ చూసిన ఈ చిత్రం థియేటర్స్‌లో ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Shanmukh Jaswanth |బిగ్ బాస్ 5 లో అత్యధిక రెమ్యునరేషన్ ఈ యూట్యూబ్ స్టార్కేనా?
నేను చచ్చిపోయుంటే బాగుండేది.. అనవసరంగా బతికున్నా.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
తన భర్త నచ్చిన ప్లేస్‌లో ఉన్నాడని చెప్పిన ప్రియాంక
బిగ్ బాస్ ఎంట్రీపై సురేఖా ఏం చెప్పిందంటే..!
సాహసం చేస్తున్న తమన్నా.. అభినందించాల్సిందే అంటున్న నెటిజన్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

