Deepika Padukone | దీపికా పదుకోన్ తల్లి కాబోతుందా? సోషల్‌మీడియాలో న్యూస్ వైరల్!
Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ తల్లి కాబోతుందని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల లండన్‌లో జరిగిన బాఫ్టా అవార్డుల కార్యక్రమంలో దీపిక బంగారు వర్ణపు చీరలో తళుక్కున మెరిసింది. ఆ ఈవెంట్ ఫొటోలు చూసిన తర్వాతనే దీపిక ప్రెగ్నెంట్ అనే వార్తలు మొదలయ్యాయి.
Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ తల్లి కాబోతుందని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల లండన్‌లో జరిగిన బాఫ్టా అవార్డుల కార్యక్రమంలో దీపిక బంగారు వర్ణపు చీరలో తళుక్కున మెరిసింది. ఆ ఈవెంట్ ఫొటోలు చూసిన తర్వాతనే దీపిక ప్రెగ్నెంట్ అనే వార్తలు మొదలయ్యాయి.
లండన్‌లో జరిగిన బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) అవార్డుల కార్యక్రమంలో దీపిక హోస్ట్‌గా పాల్గొంది. ఆ ఈవెంట్లో దీపిక బంగారు, వెండి వర్ణంలో ఉన్న చీరలో కనిపించింది. రెడ్ కార్పెట్‌పై నడుస్తున్న సమయంలో ఆమె చీర పట్టుకున్న విధానం ఫ్యాన్స్‌లో పలు సందేహాలు లేవనెత్తింది. దీపిక నడక తీరు గమనించిన నెటిజన్లు.. బేబీ బంప్స్ దాస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. రీసెంట్గా లండన్ నుంచి ముంబై తిరిగొచ్చిన తర్వాత కూడా దీపిక.. వదులుగా ఉండే ఔట్ఫిట్లోనే కనిపించింది. దీంతో కచ్చితంగా దీపిక ప్రెగ్నెంట్ అయి ఉంటుందని ఫిక్సయిపోతున్నారు. బేబీ పదుకోన్ తప్పకుండా వస్తుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. కాగా, దీపిక పదుకోన్ ప్రెగ్నెంట్ అనే వార్తలను ది వీక్ మ్యాగజైన్ కూడా ధ్రువీకరించింది.
కాగా, బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌ను 2018లో దీపిక ప్రేమించి పెండ్లి చేసుకుంది. 2013లో రిలీజైన రామ్‌లీలా సినిమాలో వీరిద్దరూ తొలిసారి కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత బాజీరావ్ మస్తానీ, పద్మావత్ సినిమాల్లో కలిసి నటించారు. దాదాపు ఆరేండ్ల ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆరేండ్ల తర్వాత దీపిక-రణ్వీర్ దంపతులు పిల్లలను కనబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

