Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Harish Rao | దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఉపాధి కల్పిస్తున్న సంస్థకు రెండేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడం దుర్మార్గమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు.
Harish Rao | దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఉపాధి కల్పిస్తున్న సంస్థకు రెండేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడం దుర్మార్గమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన జుబేదా బేగం నిర్వహిస్తున్న దివ్యాంగ్ సోలార్ సొసైటీ, దివ్యాంగ్ గార్మెంట్స్‌కు ఎస్సీ సంక్షేమ శాఖ హాస్టళ్లకు దుస్తులు కుట్టి సరఫరా చేసినందుకు రావాల్సిన రూ.16 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు హరీశ్‌రావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జుబేదా బేగం దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సంస్థలను స్థాపించి నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ హాస్టళ్లకు దుస్తులు కుట్టి సరఫరా చేసినప్పటికీ, వాటికి సంబంధించిన బిల్లులు రెండేళ్లుగా చెల్లించకపోవడంతో సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు.
బిల్లులు రాకపోవడంతో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని, బ్యాంకు రుణాల వాయిదాలు కట్టలేక సంస్థకు తాళాలు వేసే పరిస్థితి వచ్చిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. దివ్యాంగులు, నిరుపేద మహిళల శ్రమకు సంబంధించిన బిల్లులను సైతం చెల్లించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, వారి కష్టార్జితాన్ని చెల్లించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న రూ.16 లక్షల బిల్లులను విడుదల చేసి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
KTR | 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
MS Dhoni | జెన్-జీకి ఎమ్మెస్ ధోని సూచన.. అలాంటి అలవాట్లతో ఆరోగ్యం పాడవుతుందంటూ ఆందోళన
Jamia Millia Islamia | 14వ రోజుకు జామియా విద్యార్థుల నిరాహార దీక్ష.. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

