Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Saudi Arabia : సౌదీ అరేబియాపై హౌతీ ఉగ్రవాదులు వరుసగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ దాడులకు సంబంధించిన వీడియోలు షేర్ చేయొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం భారతీయులకు సూచించింది.
Saudi Arabia : సౌదీ అరేబియాపై హౌతీ ఉగ్రవాదులు వరుసగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. వివిధ రకాల డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు దిగుతుంది. అయితే, ఈ దాడులకు సంబంధించిన వీడియోలు షేర్ చేయొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం సూచించింది. సౌదీలో ఉంటున్న భారతీయులు ఈ ఆదేశాన్ని పాటించాలని సూచించింది. ఇండియాతోపాటు ఇతర దేశాల ప్రజలు కూడా ఇదే సూచన చేసింది. వివిధ ఈ మేరకు ఎక్స్ వేదికగా సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.
దీన్ని సౌదీలోని భారత రాయబార కార్యాలయం రీట్వీట్ చేసింది. సౌదీలో ఉంటున్న భారతీయులు ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించింది. ఈ సూచనల ప్రకారం.. సౌదీ అరేబియాలోని వివిధ ఎయిర్‌పోర్టులు, చమురు క్షేత్రాలపై హౌతీలు దాడులు చేస్తున్నారు. డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడికి పాల్పడుతున్నారు. అయితే, వీటిలో కొన్నింటిని సౌదీ రక్షణ విభాగం అడ్డుకుంటోంది. హౌతీల దాడులు.. పలు భవనాలు ధ్వంసం కావడం.. కొన్నింటిని సౌదీ అడ్డుకుని గాలిలోనే పేల్చేయడం వంటివి జరుగుతున్నాయి.
The Indian community residing in Saudi Arabia is requested to abide by local rules and regulations. ⬇️
— India in Saudi Arabia (@IndianEmbRiyadh) October 25, 2026
వీటన్నింటిని అక్కడ ఉన్న స్థానికులు తమ సెల్ఫోన్లలో వీడియోలు తీస్తున్నారు. వాటిని సోషల్ మీడియా, వాట్సాప్‌లలో షేర్ చేస్తున్నారు. ఈ అంశంపైనే సౌదీ స్పందించింది. భారతీయులు సహా తమ దేశంలో ఉంటున్న వారెవరూ వాటిని వీడియో తీయొద్దని, షేర్ చేయవద్దని సూచించింది. ఈ నిబంధన అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. హౌతీల దాడుల నేపథ్యంలో రియాద్, దమ్మామ్ సహా పలు ఎయిర్‌పోర్టుల నుంచి విమానయాన సేవల్నినిలిపివేస్తున్నట్లు సౌదీ ప్రకటించింది. నవంబర్ 7 వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- drone
- India
- missile
- saudi arabia
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
KTR | 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
MS Dhoni | జెన్-జీకి ఎమ్మెస్ ధోని సూచన.. అలాంటి అలవాట్లతో ఆరోగ్యం పాడవుతుందంటూ ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

