Vaishnavi Chaitanya | బేబీ సక్సెస్ బేబీకి హెల్ప్ అవుతుందా.. ఈ తెలుగు అమ్మాయి బిజీ అవుతుందా..?
Vaishnavi Chaitanya | తాజాగా బేబీ సినిమాతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది వైష్ణవి చైతన్య. యూట్యూబ్ లో ఇన్ని రోజులు వెబ్ సిరీస్ లు చేసుకున్న ఈ అమ్మాయికి బేబీ ఊహించని లాంచింగ్ ప్యాడ్ అయింది.
Vaishnavi Chaitanya | తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశాలు రావు.. కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్‌పై ఉన్న కంప్లైంట్ ఇది. ఒకప్పుడు ఎంతోమంది తెలుగు హీరోయిన్స్ ఇండస్ట్రీని కొన్ని సంవత్సరాల పాటు ఏలారు. కానీ ఇప్పటి అమ్మాయిలకు ఎందుకు అవకాశాలు రావడం లేదు అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. అసలు మన అమ్మాయిలు కనీసం ఆడిషన్స్‌కు కూడా రావడం లేదు అనేది దర్శక నిర్మాతలు చెప్తున్న మాట. అలాంటప్పుడు అవకాశాలు ఎలా వస్తాయి అంటూ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం మన తెలుగు అమ్మాయిల నుంచి మరోరకంగా వస్తుంది. ఇక్కడ ఇండస్ట్రీలో తెలుగమ్మాయి అనే టాగ్ లైన్ పడితే అవకాశాలు ఇవ్వరని చెప్తున్నారు.
ఇదే మాట గతంలో బిందు మాధవి, ఈషా రెబ్బా లాంటి వాళ్లు ఓపెన్ గా చెప్పారు. అన్నట్టుగానే వాళ్లకు తెలుగు కంటే మిగిలిన ఇండస్ట్రీల్లో ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. తాజాగా బేబీ సినిమాతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది వైష్ణవి చైతన్య. యూట్యూబ్ లో ఇన్ని రోజులు వెబ్ సిరీస్ లు చేసుకున్న ఈ అమ్మాయికి బేబీ ఊహించని లాంచింగ్ ప్యాడ్ అయింది. చాలామంది హీరోయిన్లు కలలు కనే పాత్ర ఇది. మొదటి సినిమాతోనే ఎన్నో ఎమోషన్స్ కలగలిపిన పాత్రను సాయి రాజేశ్ ఈమెను నమ్మి ఇచ్చాడు. దానికి 100% న్యాయం చేసింది వైష్ణవి చైతన్య. బేబీ సినిమా విజయంలో ఈమె పాత్ర మరువలేం. ముఖ్యంగా నిజమైన ప్రేమకు, మొహానికి మధ్య పడి నలిగిపోయే పాత్రకు ప్రాణం పోసింది వైష్ణవి. చాలా తక్కువ టైంలో ఇలాంటి ఒక క్యారెక్టర్ హీరోయిన్‌కు రావడం నిజంగానే అదృష్టం.. అందులోనూ తెలుగమ్మాయి కావడం మరో అరుదైన విషయం.
ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది.. కానీ వైష్ణవి చైతన్యకు ఇకపై కూడా అవకాశాలు వస్తాయా రావా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఎందుకంటే గతంలో సింగిల్ సినిమాతో వండర్స్ చేసిన తెలుగు అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్లు ఒక్క సినిమాతోనే కనుమరుగైపోయారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చూసినా కూడా ఎవరు గుర్తించలేదు.. గుర్తుపట్టలేదు కూడా. ఇప్పుడు వైష్ణవి చైతన్య కూడా ఆ లిస్టులోకి వెళ్లిపోతుందా లేదంటే.. ప్రత్యేకమైన స్థానం సంపాదించుకొని ఇటు గ్లామర్ తో పాటు.. అటు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చేస్తూ తనదైన ముద్ర వేస్తుందా అనేది చూడాలి.
Read More :
Pawan Kalyan | ఉస్తాద్, వీరమల్లు సినిమాలపై పవన్ తన నిర్ణయం చెప్పేశాడా.. వాటి ఫ్యూచర్ ఏంటి..?
Baby Movie | బేబీ పయనం ఇంకా ఎంత దూరం.. ఫుల్ రన్ లో 30 కోట్లు వస్తాయా..?
Devara Movie | దేవరలో అల్లు అర్జున్ గారాల పట్టి.. రెండో సినిమాకే భారీ రెమ్యునరేషన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

