టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) హీరో (Hero) సినిమా తర్వాత రెండో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా #అశోక్ గల్లా2 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుంది. జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్ వర్మ (Prashanth Verma) ఈ చిత్రానికి కథనందిస్తుండగా.. గుణ 369 ఫేం అర్జున్ జంధ్యాల (Arjun Jandyala) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్‌తో పాటు, ఫస్ట్ యాక్షన్ వీడియోను విడుదల చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమాలో అశోక్ గల్లా సరసన హీరోయిన్గా మాజీ మిస్ ఇండియా (2020) మానస వారణాసి (Manasa Varanasi) ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్రబృందం ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో ‘సత్యభామ’ రోల్ చేస్తున్న మానసకు స్వాగతం చెబుతూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ క్రేజీ ఆఫర్‌తో మానస వారణాసి చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్‌కు చెందిన మానస 2020 మిస్ ఇండియా విజేతగా నిలిచింది. 2021 మిస్ వరల్డ్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది.
manasa varanasi
Introducing our SATYABHAMA ❤️
It’s awesome to have you on-board & play the role @varanasi_manasa 🤗
Looking forward to many great moments on the sets 😊 pic.twitter.com/6c3X0FaNpR
— Ashok Galla (@AshokGalla_) August 31, 2023