OG Movie | అగ్ర కథానాయకుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న తాజా చిత్రం ‘ఓజీ’ (OG). ‘సాహో’ (Saaho) ఫేం సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. జపాన్ బ్యాక్డ్రాప్లో గ్యాంగ్స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుండగా.. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్తో పాటు గ్లింప్స్ అభిమానులను అలరించాయి ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ కథానాయికను పరిచయం చేశారు. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె పాత్రను పరిచయం చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో ప్రియాంక కన్మణి (Kanmani) అనే పాత్రలో కనిపించబోతుంది.
Every storm needs its calm.
Meet KANMANI – @PriyankaaMohan ❤️Very soon, let’s all meet with the soulful second single promo…#OG #TheyCallHimOG pic.twitter.com/hVXUbA99OD
— DVV Entertainment (@DVVMovies) August 16, 2025