
‘360 డిగ్రీ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన చిత్రమిది. ప్రథమార్థం, ద్వితీయార్థం ఒకేసారి సమాంతరంగా నడుస్తూ కొత్త అనుభూతిని కలిగిస్తుంది’ అని అన్నారు శేఖర్‌యాదవ్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘పులి వచ్చింది మేక సచ్చింది’. చిత్రంశ్రీను, జయలలిత, ఆనంద్భారతి ప్రధాన పాత్రల్లో నటించారు. భవానీ శంకర్ కొండోజు నిర్మాత. ఈ నెల 17న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో దర్శకుడు మాట్లాడుతూ ‘క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారికి, మాఫియా డాన్‌కు మధ్య మొదలైన శత్రుత్వం ఎలాంటి పరిణామాలకు దారితీసిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో పులి ఎవరు? ఆ పులి చేతిలో మరణించే మేక ఎవరన్నది థ్రిల్‌ను పంచుతుంది. అనుబంధాల్ని డబ్బు, సామాజిక పరిస్థితులు ఎలా ప్రభావితం చేస్తాయో ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఈ చిత్రానికి సీక్వెల్‌ను జనవరి 7న విడుదలచేస్తాం’ అని తెలిపారు.