‘స్పై’ చిత్రం ద్వారా తెలుగులో కథానాయికగా పరిచయమవుతున్నది ఐశ్వర్య మీనన్. నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఐశ్వర్యమీనన్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఈ కథ విని చాలా థ్రిల్‌గా ఫీలయ్యాను. ఇందులో నేను ‘రా’ ఏజెంట్ పాత్రలో కనిపిస్తాను. భిన్న కోణాల్లో నా క్యారెక్టర్ సాగుతుంది.
ఈ సినిమా కోసం గూఢచారి వ్యవస్థ పనిచేసే తీరు గురించి తెలుసుకున్నా. గన్ ఫైరింగ్‌తో పాటు యాక్షన్ సీన్స్ కోసం ఆరు నెలలు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. ఇకపై యాక్షన్ పాత్రలు లభిస్తే చాలా కాన్ఫిడెంట్‌గా చేయగలననే నమ్మకం కలిగింది. ‘రా’ ఏజెంట్‌గా నా పాత్ర సహజంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నా.
శరీర కదలికలు మొదలుకొని యాక్షన్ వరకు ప్రతీ అంశంలో నేచురల్‌గా కనిపించే ప్రయత్నం చేశా. నా డ్రీమ్‌రోల్స్ చాలా ఉన్నాయి. ‘హైవే’ చిత్రంలో అలియాభట్ తరహా పాత్రలో నటించాలనుంది. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నా’ అని చెప్పింది.