Salaar | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా సలార్ (Salaar). హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై వస్తోన్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన Salaar part-1 Ceasefire టీజర్లో డార్క్షేడ్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే స్టన్నింగ్ విజువల్స్ మధ్య సలార్‌గా రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ ఇస్తున్న సన్నివేశాలు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. సలార్ టీజర్ మిలియన్లకుపైగా వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
అయితే సెప్టెంబర్ 28న (వచ్చే నెలలోనే) సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ప్రమోషన్స్ మాత్రం అంతగా జరుగడం లేదు. దీంతో అభిమానులు నిరాశలో మునిగిపోతున్నారు. సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు #Wakeupteamsalaar హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ మరింత సమాచారాన్ని అందించాలని ఫ్యాన్స్, నెటిజన్లు కోరుతున్నారు. తాజా అప్డేట్ ప్రకారం సలార్‌లో ప్రభాస్‌కు సంబంధించి కేవలం మూడు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందట. త్వరలోనే సెట్స్‌లో జాయిన్ కానున్నాడట ప్రభాస్. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రంలో ఏడు ఫైట్స్ ఉండబోతున్నాయి. ఇందులో ప్రభాస్ సిగరెట్ తాగుతూ రౌడీలతో చేసే ఫైట్ ఒకటి సూపర్ స్పెషల్‌గా ఉండనుందట.
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న సలార్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీ రోల్ పోషిస్తున్నాడు. సలార్ పార్ట్-1 2023 సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని హోంబ్యానర్ హోంబలే ఫిలిమ్స్ పై విజయ్ కిరగందూర్ సలార్ ను తెరకెక్కిస్తున్నారు. సలార్ పార్ట్-2 ఎప్పుడు వస్తుందనేది పార్ట్ 1 రిలీజ్ తర్వాత క్లారిటీ రానుంది.
సలార్ టీజర్..