కరోనా ప్రభావంతో థియేటర్లు మూతపడటంతో మార్కెట్ లో డిజిటల్ ప్లాట్ ఫాంల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని అందించడమే లక్ష్యంగా 100 శాతం తెలుగు ఓటీటీ (Aha OTT)గా డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది ‘ఆహా’. సినిమాలు, వెబ్ సిరీస్ లు, స్పెషల్ షోల ద్వారా ఆహా వినోదాన్ని అందిస్తుంది. ఆహా త్వరలో నందమూరి బాలకృష్ణ (Balakrishna)హోస్ట్‌గా ఓ టాక్ షో (Aha talk show) చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే దీనికి సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఒకటి తెరపైకి వచ్చింది. ఈ టాక్ షోకు అన్ స్టాపెబుల్ (Unstoppable) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు న్యూస్ ఒకటి ఫిలింనగర్ లో రౌండప్ చేస్తోంది. అంతేకాదు దీనికి సంబంధించి ఆహా వీడియో త్వరలో అధికారికంగా ప్రకటన వెలువరించనున్నట్టు తెలుస్తోంది. ఈ టాక్ షోకు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ముందుగా మంచు మోహన్ బాబు కుటుంబం (Manchu family) తొలి గెస్ట్‌గా రాబోతుందని టాక్..కాగా పూర్తి వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది.
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ సినిమాలో నటిస్తుండగా..ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ద్వారకా క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్.
Chaitan Bharadwaj | మహాసముద్రంలో చాలా ట్విస్టులుంటాయి: చేతన్ భరద్వాజ్
Faria abdullah: రోడ్డుపై జాతి రత్నాలు బ్యూటీ తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్
MAA Elections | ‘మా’ ఎన్నికలపై నటుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు