Jr NTR | చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్ సెట్ అయితే చాలు..ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి వాటిలో ఎన్టీఆర్-ప్రశాంత్‌నీల్ సినిమా ఒకటి. ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించినా ఎప్పుడు సెట్స్‌మీదకు వెళ్తుందనే విషయం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నది. దీని అనంతరం హృతిక్‌రోషన్‌తో కలిసి హిందీ ‘వార్-2’ చిత్రంలో నటించబోతున్నారు ఎన్టీఆర్. ఇక దర్శకుడు ప్రశాంత్‌నీల్ ‘సలార్’ రెండో భాగంపై దృష్టిపెట్టబోతున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్-ప్రశాంత్‌నీల్ చిత్రం మరింత ఆలస్యం కావొచ్చని సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇదని, దేశభక్తి ప్రధానంగా కథ సాగుతుందని చెబుతున్నారు.