‘ఓజీ’ బ్యూటీ ప్రియాంక మోహన్‌కి అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. కొరియా టూరిజం ఆర్గనైజేషన్ ఆమెను ‘కొరియా టూరిజం గౌరవ రాయబారి’గా నియమించింది. ఇటీవలే ఆమె ‘మేడిన్ కొరియా’ అనే ఓటీటీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో కొరియా వెళ్లడం జీవితాశయంగా పెట్టుకున్న తమిళ అమ్మాయిగా ప్రియాంక మోహన్ నటించింది. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో కొరియన్ గవర్నమెంట్ ఆమెకు ఈ గౌరవాన్ని అందించడం విశేషం. కొరియన్ సంస్కృతి, పర్యాటక రంగంపై భారతీయ యువతలో అవగాహన పెంచేందుకుగాను ఆమెను ఈ పదవికి ఎంపిక చేశారు. ఈ బాధ్యతాను గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ప్రియాంక మోహన్ ఆనందం వ్యక్తం చేసింది.