Indian Police Force | బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే టైటిల్‌తో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నట్లు ఏడాది కిందటే ప్రకటించాడు. ఈ వెబ్ సిరీస్‌లో సిద్దార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ గట్రా వెబ్ సిరీస్‌పై మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. అయితే గత కొంత కాలంగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన అప్డేట్లు ఏవీ రాలేవు. దాంతో అసలు ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతుందా.. ఆగిపోయిందా అనే సందాహాలు మొదలయ్యాయి. కాగా తాజాగా మేకర్స్ ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన బిగ్ అప్డేట్ను ప్రకటించారు.
ఈ వెబ్ సిరీస్‌ను వచ్చే ఏడాది జనవరి 19నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. భారత పోలీసుల నిబద్ధతను, పరాక్రమాన్ని ఈ సిరీస్‌లో చూపించబోతున్నారు. 7భాగాలుగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ముందుగా దీపావళి 8న ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్లు ఆలస్యం కావడంతో జనవరికి పోస్ట్ పోన్ చేశారు. సిద్దార్త్ మల్హోత్రా, శిల్పాశెట్టిలతో పాటు వివేక్ ఒబెరాయ్, శ్వేతా తివారీ, నికితిన్ ధీర్, రితురాజ్ సింగ్, లలిత్‌లు పోలీసు అధికారులుగా ఈ సిరీస్‌లో కనిపించనున్నారు.
ROHIT SHETTY – AMAZON PRIME VIDEO: ‘INDIAN POLICE FORCE’ TO PREMIERE ON 19 JAN 2024… Paying tribute to the #Indian police personnel and their valour, selfless service, unwavering commitment and fierce patriotism on the #PoliceCommemorationDay, @PrimeVideoIN announces the global… pic.twitter.com/JmJ4pzlxEM
— taran adarsh (@taran_adarsh) October 21, 2023