ప్రస్తుతం యానిమేషన్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నది. లయన్కింగ్, అలావుద్దీన్ వంటి చిత్రాలు భారత్లో కూడా విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో ‘కికీ అండ్ కోకో’ పేరుతో ఓ ఇండియన్ యానిమేషన్ సినిమా రాబోతున్నది. పి.నారాయణన్ దర్శకుడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..కోకో అనే చిన్నారి, కికీ అనే పెంపుడు జంతువు మధ్య ఉన్న అపూర్వమైన మాంత్రిక బంధాన్ని ఆవిష్కరించే చిత్రమిది. పిల్లలతో పాటు పెద్దల హృదయాల్ని కూడా హత్తుకునే కథ ఇది’ అన్నారు. పిల్లలకు విలువైన జీవిత పాఠాలు నేర్పించే చిత్రమిదని, కుటుంబమంతా కలిసి చూసి ఆనందించేలా ఉంటుందని చిత్ర నిర్మాణ సంస్థ ఇనికా ప్రొడక్షన్స్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ జి.యం.కార్తికేయన్ తెలిపారు. ఈ చిత్రానికి కాన్సెప్ట్, క్రియేటివ్ డైరెక్టర్: గోకుల్ రాజ్ భాస్కర్.