చర్చలు విఫలం.. మళ్లీ మొదటికి ఇండియన్ 2 వివాదం

శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్లో రూపొందిన క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ భారతీయుడు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా భారతీయుడు 2 చిత్రాన్ని మొదలు పెట్టారు. ఈ సినిమా మొదలు పెట్టిన దగ్గర నుండి పనులు నత్తనడకన సాగుతున్నాయి. అనేక సమస్యలు చిత్ర బృందాన్ని వెంటాడుతుండడంతో సినిమా వెనక్కి వెళుతుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలు, దర్శకుడు శంకర్‌కు మధ్య సఖ్యత లేకపోయే సరికి సినిమా పెండింగ్‌లో పడింది. దీంతో శంకర్ రామ్ చరణ్, రణ్వీర్ సింగ్‌లతో తన తదుపరి ప్రాజెక్టులు చేయబోతున్నట్టు ప్రకటించాడు.
భారతీయుడు 2 చిత్రం పూర్తి చేయకుండా శంకర్ కొత్త సినిమాలు ప్రకటించడంపై లైకా సంస్థ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కింది. ఇండియన్ 2 సినిమా పూర్తి చేశాకే శంకర్ వేరే సినిమాలు మొదలు పెట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులో పిటీషన్ వేసింది లైకా. ఈ క్రమంలో కోర్టు గొడవను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. దీంతో శంకర్ తరపు లాయర్ రీసెంట్గా లైకా నిర్మాతలను కలిసి జూన్ నుండి అక్టోబర్ మధ్యలో శంకర్ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేస్తారని అన్నారు. కాని లైకా మాత్రం జూన్ నాటికి సినిమాను ముగించి తీరాలని, ఇందులో ఎలాంటి మార్పు ఉండకూడదని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య చర్చలు విఫలం కావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.
ఇవి కూడా చదవండి..
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
రాష్ట్రంలో వింత వాతావరణం..
బెంగాల్.. సస్పెన్స్ థ్రిల్లర్!
18+కు టీకాలెలా?
మ్‌డెసివిర్ ప్లీజ్!
‘స్పుత్నిక్ వీ’లో వైరస్
ముంబైలో మూడు రోజులు వ్యాక్సినేషన్ బంద్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kamal hassan
- lyca
- shankar
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

