Indian-2 | విశ్వనటుడు కమల్ హసన్ నటిస్తున్న చిత్రం భారతీయుడు-2 చిత్రం. మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. కమల్, దర్శకుడు శంకర్ కాంబినేషనల్లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రూపొందుతున్నది. జూలై 12న ప్రేక్షకుల ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్నది. ఈ క్రమంలో తాజాగా ముంబయిలో జరిగిన కార్యక్రమంలో అన్ని భాషల్లో మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న రిలీజ్ కానుంది.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నాయి. భారతీయుడు-2 మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సేనాపతిగా ‘భారతీయుడు’ చిత్రంలో కమల్ హాసన్ మెప్పించారు. ఈ మూవీకి దీనికి కొనసాగింపుగా ‘భారతీయుడు-2’ రానున్నది. తాజాగా ఇదే కాన్పెట్తో మూవీని తెరకెక్కుతుండగా.. మూవీపై భారీ అంచనాలున్నాయి. సేనాపతిగా కమల్ మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్నారు. ట్రైలర్ విషయానికి వస్తే సిద్ధార్థ్ ఓ స్టూడెంట్.
సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తుంటాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేస్తారు. ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని.. మళ్లీ ఆయన రావాలంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తారు. దీంతో సేనాపతి మరోసారి ఎంట్రీ ఇస్తాడు. ఇక ఆ తర్వాత సేనాపతి ఏం చేశాడన్నది మూవీలోనే చూడాలి. అయితే, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకున్నాయి. మూవీని అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో నిర్వహించగా.. సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్యా, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. మూవీకి చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించారు.