Indian 2 | లోక నాయకుడు కమల్‌హాసన్ (Kamal Haasan) నటిస్తోన్న తాజా చిత్రం ఇండియన్ 2 (Indian 2). శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొత్త అప్డేట్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఇండియన్ 2 చెన్నై షెడ్యూల్ పూర్తయింది. నెక్ట్స్ షెడ్యూల్‌ను లాస్ ఏంజెల్స్‌లో మొదలు పెట్టబోతున్నారు. 10 రోజుల పాటు కొనసాగనున్న ఈ షెడ్యూల్ కోసం త్వరలోనే శంకర్ అండ్ కమల్ హాసన్ టీం యూఎస్ఏకు పయనం కానుంది.
ఇండియన్ 2 ఇప్పటికే తైవాన్, సౌతాఫ్రికా ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. శంకర్(Shankar) టీం సాంగ్స్‌తోపాటు ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ను ఈ షెడ్యూల్స్‌లో చిత్రీకరించినట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో బాబీ సింహా, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్ 2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన ఇండియన్ 2 ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. కమల్ హాసన్ మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో 234వ ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇండియన్ 2 పూర్తయ్యాక ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాడు.