Indian-2 Movie Shooting | లోకనాయకుడు కమల్ ఎన్నో ఏళ్ల తర్వాత ‘విక్రమ్’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. గతేడాది జూన్ మాసంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజు నుంచే బాక్సాఫీస్‌పై దాడికి దిగింది. రిలీజ్‌కు ముందు జరిగిన హాడావిడితో ఓపెనింగ్స్ కమల్ స్థాయికి మించి వచ్చాయి. తొలిరోజే అనుకుంటే రెండోరోజు కలెక్షన్ల సంఖ్య మరింత పెరిగింది. ఇక కేవలం వారంలోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని తమిళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం అదే ఊపులో ‘ఇండియన్-2’ సినిమా చేస్తున్నాడు. ఎన్నో అంతరాయాల తర్వాత గతేడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ పున: ప్రారంభమైంది.
అప్పటి నుండి షూటింగ్ యథావిధిగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లోని జమ్మలమడుగు దగ్గరున్న గండికోటలో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో కమల్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. కాగా షూటింగ్ స్పాట్లో ఉన్న కమల్‌ను చూసేందుకు అభిమానులు బారులు తీస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కమల్‌కు జోడీగా కాజల్ నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్, రెడ్‌జియాంట్ మూవీస్ బ్యానర్లపై ఏ.సుభాస్కరణ్, ఉదయనిధి స్టాలిన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
There's no shooting happening of #RC15. Currently director Shankar kick started #Indian2 starring #Kamalhassan. Shooting happening at #gandikota pic.twitter.com/bA4FUTss28
— Remo Mama (@RemoMowa) January 30, 2023