Indian-2 Movie | శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్-2 సినిమాకు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిందని చెన్నై టాక్. కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. దర్శకుడు శంకర్ రోబో సీక్వెల్ తర్వాత ఏడాది గ్యాప్‌లోనే ఈ సినిమాను పట్టాలెక్కించాడు. కొంత వరకు షూటింగ్ కూడా జరిగింది. కానీ పలు కారణాల వల్ల ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. మళ్లీ ఎన్నో అంతరాయాల తర్వాత గతేడాది సెప్టెంబర్‌లో ఇండియన్-2 సినిమా షూటింగ్ పునఃప్రారంభమైంది. అప్పటి నుండి షూటింగ్ యథావిధిగా జరుగుతుంది. శంకర్ ఓ వైపు గేమ్ చేంజర్ తెరకెక్కిస్తూనే.. మరోవైపు ఇండియన్-2 సినిమాను పూర్తి చేస్తున్నాడు.
కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందని తమిళ మీడియా కోడై కూస్తుంది. ఈ సినిమాను శంకర్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడట. అంటే ఈ సినిమా గురువారం రిలీజవుతుంది. ఆ రోజు ఎలాగూ పబ్లిక్ హాలీడే. ఆ తర్వాత వీకెండ్ మూడు రోజులు. ఇలా సినిమాకు పర్ఫెక్ట్ టైమ్ ఇదే అని భావించి శంకర్ ఆ నిర్ణయం తీసుకున్నాడట. కమల్ సహా ఇండియన్-2 బృందం మొత్తం అదే సరైన డేట్ అని భావిస్తున్నారట. త్వరలోనే దీన్ని అఫిషియల్‌గా కూడా ప్రకటించబోతున్నట్లు ఇన్సైడ్ టాక్.
ఇక ఈ సినిమాకు సంబంధించిన కీలక భాగం షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందట. కొంత మైనర్ పార్ట్ మాత్రమే మిగిలుందట. అది కూడా రెండు, మూడు నెలల్లో పూర్తవుతుందని సమాచారం. ఆపై వీఎఫ్ఎక్స్ పనుల్లో మేకర్స్ మునిగిపోనున్నారట. కాగా ఈ సినిమా షూటింగ్ ఫుటేజీ మొత్తం దాదాపు 6గంటలు వచ్చిందని.. దాంతో ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నట్లు ఆ మధ్య పుకార్లు షికారు చేశాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని.. ఒక్క పార్టుగానే సినిమా రిలీజవుతుందని తెలుస్తుంది. అంతే కాకుండా ఈ డేట్ గేమ్ చేంజర్‌కు కూడా బాగా కలిసొచ్చే చాన్స్ ఉంది.
ఇండియన్-2కు ఎలాగో ఏడాది టైమ్ ఉంది గనుక.. శంకర్ గేమ్ చేంజర్‌ను ముందుకు జరిపే చాన్స్ ఉంది. అన్ని అనుకున్నట్లుగా కుదిరితే సమ్మర్లో గేమ్ చేంజర్ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇప్పటికే మెగా ఫ్యాన్స్ శంకర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అప్డేట్లు ఇవ్వడం లేదు. రిలీజ్ డేట్ చెప్పడం లేదు. అసలు షూటింగ్ ఎక్కడి వరకు వచ్చిందన్న క్లారిటీనే లేదు. ఒక స్టార్ హీరో సినిమాను హ్యాండిల్ చేసే పద్దతి ఇదేనా అని గుర్రమంటున్నారు. ఇదే విషయం దిల్‌రాజు అడిగితే.. తన చేతులో ఏమి లేదు.. మొత్తం శంకర్ చేతుల్లోనే ఉందనే విధంగా స్పందించాడు. ఇలాంటి టైమ్‌లో ఈ రూమర్ బయటకు రావడం