50 రోజుల్లో 1000 కోట్ల బిజినెస్.. 2022 ఆరంభంలో అరాచకం..

Tollywood | వినడానికి కూడా చాలా టెంప్టింగ్ గా ఉంది కదా..! ఒకవేళ ఇదే నిజమైతే ఎంత బాగుంటుందో. చూస్తుంటే ఇప్పుడు ఇది నిజమే అయ్యేలా కనిపిస్తోంది. 2022 ప్రారంభంలో కొన్ని సినిమాలు వస్తున్నాయి. వాటి బిజినెస్ స్థాయి చూస్తుంటే తెలుగు సినిమా రేంజ్ ఎంత పెరిగిందో అర్థమవుతుంది. ముఖ్యంగా కేవలం 50 రోజుల్లోనే 1000 కోట్ల బిజినెస్ జరగబోతుంది. అంతేకాదు అప్పుడు రాబోయే సినిమాల్లో చాలావరకు మల్టీస్టారర్ కావడం మరో విశేషం.
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలు చాలానే వస్తున్నాయి. మన హీరోలు కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కథలు బాగుంటే క్యారెక్టర్ చిన్నది పెద్దది అని చూడకుండా ఇతర హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీలో అరడజను మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. ఇక 2022 సంగతి చూసుకుంటే తొలి 50 రోజుల్లోనే ఏకంగా ఐదు మల్టీస్టారర్స్ విడుదల అవుతున్నాయి. జనవరి 7న ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ట్రిపుల్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా బిజినెస్ దాదాపు 500 కోట్లు. ఇక జనవరి 12న పవన్ కళ్యాణ్ రానా కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ విడుదల కానుంది. ఈ సినిమా బిజినెస్ కూడా రూ.140 కోట్ల వరకు జరుగుతుంది.
జనవరి 15న నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న బంగార్రాజు సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు రూ.40 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడు. ఇక ఫిబ్రవరి 4న చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషనలో వస్తున్న ఆచార్య సినిమా విడుదల కానుంది. సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆచార్య కూడా దాదాపు 120 కోట్ల వరకు బిజినెస్ చేస్తోంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫిబ్రవరి 25న ఎఫ్ 3 సినిమా విడుదల కానుంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్, వెంకటేశ్ హీరోలుగా నటిస్తున్నారు దాదాపు 80 కోట్లకు పైగా ఈ సినిమా బిజినెస్ చేస్తోంది. ఇలా కేవలం 50 రోజుల వ్యవధిలో ఐదు మల్టీస్టారర్స్ విడుదలవుతున్నాయి. వీటి బిజినెస్ 1000 కోట్లు దాటిపోయింది. మరి ఇవి తీసుకొచ్చే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
చిరంజీవి, రజినీకాంత్ సినిమాల మధ్య ఈ పోలికలు గమనించారా..?
పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త విని ఆగిపోతున్న అభిమానుల గుండెలు..
Anupama : అనుపమ అడ్డుకట్టలు తొలగించి లిప్‌లాక్‌లతో చెలరేగిపోనుందా?
RRR: ఆర్ఆర్ఆర్ అభిమానులకి గుడ్ న్యూస్.. ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడో తెలుసా?
Katrina: 15 ఏళ్ల నుంచి నా పెళ్లి గురించి ఏదొక వార్త వస్తూనే ఉంది: కత్రినా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

